Power outage tomorrow: ఇబ్రహీంపట్నం, నవంబర్ 8 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూర్, వేములకుర్తి గ్రామాల్లో ఉన్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల్లో మరమ్మతులు శనివారం నిర్వహిస్తున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియెగదారులు సహకారించాలని ఏఈ సతీశ్ కోరారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.