Tribal Ashram School Students: నిర్మల్, నవంబర్ 8 (మన బలగం): ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 3రోజుల పాటు ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఐదో గిరిజన రాష్ట్ర స్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్‌లో నిర్మల్ జిల్లాకు చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాలల బాల, బాలికలు పలు క్రీడా విభాగాల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి జె.అంబాజీ తెలిపారు. క్యారమ్ బోర్డు, చేస్, ఖోఖో, పోటీల్లో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. అండర్-14 బాలికల కబడ్డీ, అండర్-17 వాలీబాల్, అండర్-14 ఆర్చరీ పోటీల్లో రెండో స్థానంలో, లాంగ్ జంప్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచి ఉత్తమ ప్రదర్శన కనబరిచినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులను ఏసీఎంవో శివాజీ, క్రీడా అధికారి భుక్య రమేశ్, ఆశ్రమ పాఠశాలల హెడ్మాస్టర్లు అనూష, రాంజీ, ఉపాధ్యాయులు తదితరులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.