Metpally AMC: మెట్పల్లి (ఇబ్రహీంపట్నం), నవంబర్ 14 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం చైర్మన్గా కూన గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ కూన గోవర్ధన్ కార్యాలయానికి రాగా వ్యవసాయ కమిటీ కార్యదర్శి ఎం.ఇంద్రసేనారెడ్డి పుష్పగుచ్ఛాలతో ఆహ్వానం పలికారు. అనంతరం పదవి బాధ్యతల సంతకాలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ గోవర్ధన్ మాట్లాడుతూ తమ గురువు కల్వకుంట్ల సుజిత్ రావు ఆశీస్సులతో చైర్మన్ బాధ్యతులు తీసుకున్నానని, విప్, ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నూతన భవన నిర్మాణం కోసం కల్వకుంట్ల సుజిత్ రావు సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం సుజిత్ రావు ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యాలయ కార్యదర్శి సిబ్బంది, పలువురు సన్మానం చేసి అభినందించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎం.ఇంద్రసేనారెడ్డి, సూపర్వైజర్ హరికృష్ణ, పాలకవర్గ సభ్యులు మానాల లింగారెడ్డి, అందె భవిత, రైతు నాయకులు సత్యం కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు కుదుబుద్దిన్ పాషా, కల్లెడ గంగాధర్, నారాయణ, శేఖర్ రెడ్డి, భరత్, వికాస్, శ్రీకాంత్, గిరి తదితరులు పాల్గొన్నారు.