Dharmapuri
Dharmapuri

Dharmapuri: ధర్మపురిలో ట్రాఫిక్ ఆంక్షలు

Dharmapuri: ధర్మపురి, నవంబర్ 14 (మన బలగం): ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పిలిచే ధర్మపురిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 15వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు సీఐ రామ్ నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఐ ప్రైవేటు వాహనాలు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల ద్వారా వచ్చే భక్తులు వాహనాలను బ్రాహ్మణ సంఘం, ఇసుక స్తంభం, నంది చౌరస్తా, వైశ్య సత్రాల నుంచి వాహనాలను శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు అనుమతించబడవని పేర్కొన్నారు. వాహనాలలో వచ్చే భక్తులు తమ వాహనాలను నంది చౌరస్తా, కూరగాయల మార్కెట్ వద్ద, హరిత హోటల్ పక్కన, మంగళిగడ్డ వద్ద, బ్రాహ్మణ సంఘం వద్ద ఏర్పాటు చేసిన వాహన పార్కింగ్ స్థలాల్లో పార్కింగ్ స్థలంలో నిలుపుకోవాలని సూచించారు. దైవ దర్శనానికి, గోదావరి స్నానానికి, కోనేరుకు కాలినడకన వెళ్లాలని భక్తులను కోరారు. భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *