Inspection of Model School
Inspection of Model School

Inspection of Model School: కథలాపూర్ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

Inspection of Model School: జగిత్యాల, నవంబర్ 29 (మన బలగం): కథలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ బి.సత్య ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను, వంటశాలను, స్టోర్ రూంను తనిఖీ చేశారు. ల్యాబ్ కంప్యూటర్, పిల్లలకు అందిస్తున్న శిక్షణ తరగతులలో అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ ప్రొవిజన్స్‌ను పరిశీలించారు. నాణ్యమైన భోజనం, బియ్యం ముడి సరుకులు నాణ్యమైనవి అందించాలి. అలాగే పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం గురించి తగు సలహాలు, సూచనలు సూచించారు. భోజనం రోజూ వారి మెనూ ప్రకారం అందించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ గ్రౌండ్ ఆవరణలో చెరువు మత్తడి నుంచి వర్షాకాలం ఎక్కువగా నీరు వచ్చి గ్రౌండ్‌లో స్టోరేజ్ అవుతుందని పిల్లలకు ఇబ్బందిగా ఉంది. అని అలాగే హాస్టల్‌కి వెళ్లే దారిలో ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ వెంటనే కావలిసిన మరమతులు ఐ మ్యాక్స్ లేట్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లను శానిటేషన్ చేయించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు పాఠశాల నిర్వహణలో కాని, భోజన ఏర్పాట్లలో కాని ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట, ఆర్డీవో, ఎమ్మార్వో, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *