Congress leaders protest: నిర్మల్, డిసెంబర్ 20 (మన బలగం): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. స్థానిక మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట అమిత్ షా చిత్రపటాన్ని చింపి నిరసన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ దళితుల వెనుకబాటుతనాన్ని, అంటరానితనాన్ని తీవ్రంగా ప్రశ్నించి, తన జీవితాన్ని బడుగు, బలహీన వర్గాలకు అంకితం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. అమిత్ షా అంబేద్కర్‌ను పలుచన చేస్తూ వ్యాఖ్యలు చేయడం, వాటిని ప్రధానమంత్రి మోడీ సమర్థించడం సరికాదని పేర్కొన్నారు.
పట్టణ అధ్యక్షులు చిన్నూ మాట్లాడుతూ రాజ్యాంగ మార్పు అనేది బీజేపీ లక్ష్యం అని, అమిత్ షా అంబేద్కర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంటనే అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్ రెడ్డి, అబ్దుల్ హాదీ, పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను, నిర్మల్, లక్ష్మణచంద మండల పార్టీ అధ్యక్షులు కుంట వేణుగోపాల్, వోడ్నాల రాజేశ్వర్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సమర సింహారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రాకేష్, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు అర్షద్, దేవరకోట దేవస్థాన చైర్మన్ శ్రీనివాస్, నాయకులు మతీన్, జునైద్, పురపాలక సంఘం మాజీ ఉపాధ్యక్షులు వాజీద్ ఖాన్, నర్సారెడ్డి, అయ్యన్నగారి పోశెట్టి, కొంతం గణేష్, సభా కలీం, మజర్, భూరాజ్, రఫీ, గుల్లె రాజన్న, అడ్పా శ్రీకాంత్, నవీద్, తదితరులు పాల్గొన్నారు.