library Opening: ధర్మపురి, డిసెంబర్ 21 (మన బలగం): ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాన్ని జిల్లా విద్యాధికారి కె.రాము శనివారం ప్రారంభించారు. పాఠశాల ఉపాధ్యాయులు గొల్లపల్లి గణేశ్ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్కు చెందిన వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్స్ రేణుక దయానంద రెడ్డి రూ.30 వేల విలువ గల పుస్తకాలు, ఒక బీరువాను అందించారు. ఈ సందర్భంగా విద్యాధికారి దాతలను అభినందిస్తూ, విద్యార్థులు ఈ పుస్తకాల ద్వారా మంచి జ్ఞానాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎస్.సీతలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెండ్యాల మహేందర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు కాసర్ల నరసింహ మూర్తి, గొల్లపెల్లి గణేశ్, జ్యోతి, వంశి, రమేశ్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.