Alumni Association: బుగ్గారం, డిసెంబర్ 22 (మన బలగం): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-1999 సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత అందరూ కలిసి బుగ్గారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులను పిలిపించి సన్మానించిన విద్యార్థులు అనంతరం విద్యార్థులందరూ చదువుకున్నప్పటి పూర్వజ్ఞాపకాలను పంచుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో అప్పుడు చదువుకున్న 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.