Journalists who met ASP: నిర్మల్, జనవరి 3 (మన బలగం): పాత్రికేయులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. నిర్మల్ సబ్ డివిజన్‌కు ఏఎస్పీ నూతనంగా నియమితులైన రాజేశ్ మీనాను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ పాత్రికేయులు జి.శ్రీనివాసా చారి, ఎంఏ వసీం, మహమ్మద్ ముఖీముద్దీన్, ఎజాజ్ అహ్మద్ ఖాన్, ఎంఏ రషీద్, షాహిద్ హాష్మీ కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు.