Savitribai Phule Jayanti
Savitribai Phule Jayanti

Savitribai Phule Jayanti: సావిత్రి బాయి ఫూలే ఆశయ సాధనకు కృషి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Savitribai Phule Jayanti: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సావిత్రి బాయి ఫూలే ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం పూల మాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వం కోసం పోరాడారని కొనియాడారు. ఫూలె దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పునకు సావిత్రిబాయి ఫూలే పునాది వేశారన్నారు. జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *