The thief found
The thief found

The thief found: దొరికిన దొంగ.. డయల్ 100 తో స్పందించిన ఏఎస్పీ

The thief found: నిర్మల్, జనవరి 4 (మన బలగం): నిర్మల్ బస్టాండ్ సమీపంలో మొబైల్ షాప్‌లో దొంగతనానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని డయల్ 100కు అందిన సమాచారానికి వెంటనే ఏఎస్పీ రాజేశ్ మీనా స్పందించారు. క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున నారాయణ్ రెడ్డి మార్కెట్ సమీపంలోని మ్యాక్స్ మొబైల్ షాప్ తాళాలు పగలకొట్టి దొంగతనానికి ప్రయత్నం చేస్తున్నట్లు దగ్గరలో ఉన్న వ్యక్తి ఆ షాప్ యజమానికి కాల్ చేశాడు. యజమాని వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేసాడు. తక్షణమే నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా నైట్ పెట్రోలింగ్‌లో ఉన్న ఎస్ఐ సందీప్, పెట్రోల్ కార్ సిబ్బందితో కలిసి ఫిర్యాదు అందిన ఐదు నిమిషాల్లోపే సంఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతనానికి యత్నిస్తున్న నిందితుడిని పట్టుకున్నారు. నిర్మల్ పట్టణ పొలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. దంగతనానికి పాల్పడింది మైనర్ కావటంతో జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏఎస్పీ రాజేశ్ మీనా, సందీప్ ఎస్ఐ, మహేందర్ పీసీ, ప్రవీణ్ పీసీ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *