Awareness of students
Awareness of students

Awareness of students: పరీక్షల ఒత్తిడి జయించాలి: మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ కుమార్

Awareness of students: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: విద్యార్థులు మనోధైర్యంతో పరీక్షల ఒత్తిడిని జయించాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజీలో గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష ఒత్తిడి లేకుండా చూసుకోవాలన్నారు. మానసికంగా బాధపడుతున్న వారికి ధైర్యం కలిగించారు. సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు విద్యార్థులు పరీక్షా సమయంలో మానసికంగా బాధ పడకుండా మనోధైర్యంతో ఉండాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *