Pre-Sankranti celebrations: నిర్మల్, జనవరి 10 (మన బలగం): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవారపేట్, నిర్మల్‌లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థినులకు సంక్రాంతి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఉపాధ్యాయినులు గాలిపటాలను ఎగరవేశారు. కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు ముడారపు పరమేశ్వర్‌తో పాటు ఉపాధ్యాయులు జాఫర్ మొహీనుద్దీన్, మనోహర్ రెడ్డి, గౌసోద్దీన్, లక్ష్మణ్, ప్రేమల, వర్ష, సుజాత, ఖుద్దిస్ సున్నీసా తదితరులు పాల్గొన్నారు.
