Rangoli Competition: మల్యాల, జనవరి 12 (మన బలగం): ముత్యంపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలో ముల్క తేజస్విని విజేతగా నిలిచారు. మొదటి బహుమతి తేజస్వినికి ప్రదానం చేసారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొండబత్తిని శ్రీనాథ్, సంధి రెడ్డి, జలంధర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు, మర్రి మనోజ్, కార్యదర్శి, కోగిల వంశీ, కోశాధికారి బాలే గణేశ్, యూత్ మెంబర్, బాలే వంశీ, యూత్ సభ్యులు పాల్గొన్నారు.