Gram Sabha: మల్యాల, జనవరి 21 (మన బలగం): మల్యాల మండలంలోని గుడిపేట గ్రామంలో ప్రజా పాలన ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. మల్యాల ఎంపీడీవో స్వాతి మాట్లాడుతూ సంక్షేమ పథకాల ప్రక్రియను నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను గుర్తించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ రైతు భరోసా పథకాల గురించి వివరించారు. వ్యవసాయం చేసే రైతు కుటుంబానికి గాను ప్రభుత్వం రైతు భరోసా కింద 12000 రూపాయల చొప్పున సహాయంగా అందిస్తుందని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని చేసిన వారిని లబ్ధిదారులుగా గుర్తించనున్నారు. కొత్త ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. సభలో అర్హులైన లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించారు. ఈ గ్రామ సభలో ఎంపీడీవో స్వాతి, స్పెషల్ ఆఫీసర్ జితేందర్ రెడ్డి, డీసీఎస్వో స్పెషల్ ఆఫీసర్ ఈ.రాజ్ కుమార్, గ్రామపంచాయతీ సెక్రెటరీ కృష్ణ, ఏపీవో ఏ.శ్రీనివాస్, ఆర్ఐ రాణి, వీవోఏ సాత్విక, మహిళా సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.