Municipal Commissioner: నిర్మల్, జనవరి 31 (మన బలగం): నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా జగదీశ్ గౌడ్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ కమిషనర్‌గా విధులు నిర్వహించిన మొహమ్మద్ ఖమర్ అహ్మద్ రాయికల్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. జగిత్యాల జిల్లా రాయికల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ గౌడ్‌ను ప్రభుత్వం నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్లు కమిషనర్‌ను కలిశారు.