Award presentation: ముధోల్, 23 ఫిబ్రవరి (మన బలగం): నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ఎస్.ఎస్.డి. సైనిక్, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ప్రసంజీత్ గజ్జారాం హేమ్లేను ఆదిలాబాద్‌లోని చిలుకూరి లక్ష్మినగర్‌లో ఉన్న సంఘం కార్యాలయంలో ఆదివారం గురు రావిదాస్ 648వ జయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. అతిథులు మాజీ మంత్రి జోగు రామన్న, ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సాహిత్య వేత్త మధు భావల్కర్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు ప్రసంజీత్ హేమ్లేను అభినందిస్తూ అవార్డు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ గుర్తింపు తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహిస్తుందన్నారు. సమాజానికి మేలు చేయడం తన బాధ్యతగా భావించి సేవా కార్యక్రమాలు చేపడతాను అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్కృతిక, కవి సమ్మేళనం, ఏకపాత్ర అభినయ, నాటికలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రశాంత్ వంజారే, ఉత్తమ్ శిల్ప పవర్, విజయ్ కుమార్, గాయిత్రి అనిల్ రాంటేకే, డా.ఎ.సంజయ్ గవాలే, సోనూనే, డా.రాజు రావేకార్, సంఘం అధ్యక్షులు ఇ.రఘునాథ్, సంజయ్, సంతోష్, రమేష్, దాదారావు, రాంజీ, పలు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, బౌద్ధ ఉపాసిక, ఉపాసకులు మరియు మాజీ శ్రామినర్, బౌద్ధాచార్యులు, కేంద్రీయ శిక్షకులు, బౌద్ధ దమ్మ అభిమానులు, మహారాష్ట్ర కార్యకర్తలు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.