MLC elections: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 24 (మన బలగం): కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల స్థానానికి పోటీచేస్తున్న యువ నాయకుడు, విద్యావేత్త ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ వీర్నపల్లి మండల అధ్యక్షుడు గజ్జెల ప్రశాంత్ కోరారు. అత్యున్నత ఉద్యోగాన్ని వదిలి నిరుద్యోగ యువత కోసం, వారి భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు ప్రసన్న హరికృష్ణ అని అన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని బరిలోకి నిలుపకుండా బీసీలను చట్ట సభల్లోకి వెళ్లకుండా కుట్ర పన్నుతున్నాయని దుయ్యబట్టారు. కానీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే బీసీలను గుర్తించి ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఈ ఎన్నిక కామన్ మాన్కు, కరెన్సీ మాన్కు మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించారు. ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన సర్వేలలో ప్రసన్న హరికృష్ణ ముందు వరుసలో దూసుకుపోతున్నడని తెలిపారు. మండలంలోని విద్యావంతులైన పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తిరుపతి నాయక్, గజ్జెల శ్రీనివాస్, జోగుల నరేష్, లంక శంకర్, గుమ్మడి గణేష్, గంగు తదితరులు పాల్గొన్నారు.