Women’s Day: మల్యాల, మార్చి 15 (మన బలగం): మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా సమాఖ్యలో శనివారం సక్సెస్ ఉమెన్‌లను సన్మానించారు. మల్యాల మండలంలోని ముత్యంపేట సరస్వతి గ్రామ సంఘం నుంచి జక్కని అంజవ్వ, కొండగట్టు జై హనుమాన్ గ్రామ సంఘం నుంచి ఆకుల లత సక్సెస్ ఉమెన్‌గా ఎంపికయ్యారు. వీరితోపాటు ఉషోదయ మండల సమాఖ్య అధ్యక్షురాలు బోనాల అంజలిని సన్మానించారు. ఎంపికైన సభ్యురాలు మాట్లాడుతూ సంఘంలో చేరడం ద్వారా ఈరోజు తాము ఆర్థికంగా ఎదిగామని తెలిపారు. ఎంటర్ ప్రైజెస్ ద్వారా లోన్స్ తీసుకొని బిజినెస్‌ను ప్రారంభించామని, ఆ బిజినెస్ ద్వారా చాలావరకు మెరుగుపడ్డామని వివరించారు. తాము ఈరోజు సక్సెస్ ఉమెన్‌గా అవ్వడానికి మండలంలోని ఏపీఎం చిన్న రాజయ్య, సీసీలు, వివో ఎస్మలత మరియు సుధా, మండల అధ్యక్షురాలు బోనాల అంజలి ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. వారి ప్రోత్సాహంతో బిజినెస్ పెట్టి ఈరోజు ఆర్థికంగా మెరుగుపడ్డామని వివరించారు. ఇలా మేమే కాకుండా ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో రాణించాలి అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ అని చెప్పారు. కార్యక్రమానికి జిల్లా పీడీ రఘువరన్, డీపీఎంఐబీ మాణిక్ రెడ్డి, డీపీఎం ఫైనాన్స్ విజయభారతి, ఐబీఏ పీఎం రమాదేవి, అడ్మిన్ అసిస్టెంట్ విజయలక్ష్మి, అడ్మినిస్ట్రేటివ్ జనత, ఈజీఎస్ అపర్ణ, జిల్లా అధ్యక్షురాలు వనిత, కార్యదర్శి సరిత, సహాయ కార్యదర్శి మాలతి, మల్యాల మండల సమైక్య అధ్యక్షరాలు బోనాల అంజలి, ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
