LIC agents protest: ఐఆర్‌డీఏ, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జీవిత బీమా సంస్థలు అవలంబిస్తున్న మొండివైఖరికి నిరసనగా బుధవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో చేపట్టిన దేశవ్యాప్త ఎల్‌ఐసీ ధర్నాలో నిర్మల్ ఎల్‌ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ లియాపి అధ్యక్షలు గాండ్ల నారాయణ, ప్రధాన కార్యదర్శి పుప్పాల భాస్కర్ మాట్లాడుతూ పాలసీదారులకు పాలసీపై బోనస్ పెంచడం, క్లాబాక్, ఎస్ఏ తగ్గించడం, జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కోశాధికారి ముజ్జిగ వినోద్ కుమార్, మాడ చిన్నయ్య, పోతగంటి మల్లేశం, బ్రహ్మావత్ రామారావు, కమతాల శ్రీనివాస్, సందు రాజేశ్వర్, రాజారపు శ్రీనివాస్, కొండల్వార్ రాములు, కండికే గౌతమ్, డి.గంగాధర్, పెండెం శ్రీనివాస్, నిర్మల్ బ్రాంచ్ నుంచి దాదాపు 50 మంది ఏజెంట్లు పాల్గొన్నారు.