- చంద్రబాబు సీఎంగా నాలుగోసారి ప్రమాణం
- బాబుతోపాటు ప్రమాణం చేయనున్న మంత్రులు
- కార్యక్రమానికి హాజరవుతున్న ప్రధాని మోడీ, అమిత్ షా
- కేసరపల్లిలో భారీ ఏర్పాట్లు
AP Cabinet Ministers: నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేసరపల్లి ఐటీ పార్కులో ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలు రాష్ర్టాల సీఎంలు, మంత్రులు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. 80 వేల మందికిపైగా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అతిథులు, ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు వేశారు. అంచనాకు మించి ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రాంగణం బయట ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో చంద్రబాబు నాయుుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కేబినెట్ మంత్రుల జాబితాను విడుదల చేశారు.
నారా లోకేశ్
పవన్ కల్యాణ్
కింజారపు అచ్చెన్నాయుడు
కొల్లురవీంద్ర
నాదెండ్ల మనోహర్
పి.నారాయణ
వంగలపూడి అనిత
సత్యకుమార్ యాదవ్
నిమ్మల రామానాయుడు
ఎన్ఎండీ ఫారూఖ్
ఆనం రామనారాయణ రెడ్డి
పయ్యావుల కేశవ్
అనగాని సత్యప్రసాద్
కొలుసు పార్థ సారథి
డోలా బాల వీరాంజనేయ స్వామి
గొట్టిపాటి రవికుమార్
కందుల దుర్గేశ్
గుమ్మడి సంధ్యారాణి
బీసీ జనార్దన్ రెడ్డి
టీజీ భరత్
ఎస్.సవిత
వాసం శెట్టి సుభాష్
కొండపల్లి శ్రీనివాస్
మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా కూటమి అభ్యర్థులు 164 చోట్ల జయకేతనం ఎగురవేశారు. టీడీపీ 135 సీట్లు కైవసం చేసుకోగా, జనసేన పార్టీ పోటీ చేసిన 22 స్థానాలకు మొత్తం కైవసం చేసుకున్నది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయగా ఎనిమిది చోట్ల గెలుపొందింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ ప్రస్తుతం కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. చంద్రబాబు నాయుుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగో సారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, రాష్ర్ట విభజన తరువాత రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.