Plane Crash: బ్రెజిల్‌లో 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. సావో పువాలోలోని నివాస ప్రాంతమైన విన్‌హెడోలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. విమానం సావో పువాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంపై అధ్యక్షుడు లుయూజ్ లులా డసిల్వా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో ఎంత మంది చనిపోయారో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. ప్రమాదం జరగడంతో భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. విమానం కుప్పకూలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.