Modi, Pawan, Chiranjeevi: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. వేదికపై ఉన్న మోడీ, చంద్రబాబు సహా ప్రముఖులందరికీ నమస్కరిస్తూ పవన్ కల్యాణ్ వేదికపైకి చేరుకున్నారు. వేదికపైనే తన అన్న చిరంజీవికి పవన్ కల్యాణ్ పాదాభివందనం చేశారు. కూటమి పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాట్లాడిన మోడీ వెంటనే చిరంజీవి వద్దకు స్వయంగా వెళ్లి పలకరించారు. మోడీకి ఓ పక్కన పవన్, మరో పక్కన చిరంజీవిని చూసిన జనం చప్పట్లు, ఈలలతో హర్షధ్వానాలు చేశారు. ‘జైపవన్’ ‘జై చిరంజీవి’ అంటూ సభా ప్రాంగణమంతా మార్మోగింది. మోడీ, చిరు, పవన్‌లను ఒకే వేదికపై చూసిన ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అరుదైన దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. చిరంజీవి, వపన్ కల్యాణ్ ఇద్దరు చేతులను మోడీ పైకెత్తి తన ఆత్మీయతను చాటుకున్నారు. చిరంజీవి పవన్ చెంపలు స్పృషిస్తూ సోదర ప్రేమను పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకార వేదికపై అపూర్వ కలయికను చూసి అందరి గుండెలు ఉప్పొంగిపోయాయి.