Here are the sun risers.. and where to die..? : సన్ రైజర్స్ కొత్త కోచ్, కొత్త కెప్టెన్, కొత్త ప్లేయర్లతో దూకుడైన ఆటతీరుతో ఐపీఎల్ రేంజ్‌ను ఒక లెవల్లోకి తీసుకెళ్లింది. గతంలో సన్ రైజర్స్ మ్యాచ్‌కు స్టేడియంలో ప్రేక్షకులు ఉండకపోయేవారు. గత నాలుగైదు సీజన్లలో లాస్ట్ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ఈ సారి సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయ్యాయి.
ఐపీఎల్ 17కు సంబంధించి ఆటగాళ్ల వేలంలో ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంత రేటు పెట్టి కొనడం ఎందుకని చాలా మంది ఆమెను విమర్శించారు. ప్యాట్ కమిన్స్ మాత్రం బౌలింగ్‌తో పాటు కెప్టెన్‌గా అదరగొడుతున్నాడు. సన్ రైజర్స్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఒకప్పుడు సాదాసీదాగా ఆడే జట్టు భీకరమైన బ్యాటింగ్‌తో భారీ స్కోర్లు చేస్తోంది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ ఈ సీజన్లో ట్రెండ్ క్రియేట్ చేశారు. ఓపెనింగ్‌లో సెంచరీల భాగస్వామ్యాలు నమోదు చేశారు. సన్ రైజర్స్ బ్యాటింగ్‌లో హెడ్, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కమ్, సమద్ ఇలా బ్యాటర్లందరూ ప్రత్యర్థి బౌలర్లపై సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లో కూడా భువీ, నటరాజన్, కమిన్స్, జైదేవ్ ఉనద్కత్ తక్కువ పరుగులు ఇస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు.
ముంబయి, లక్నో, ఆర్సీబీ, ఢిల్లీ బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. 250 పరుగులకు మూడు మ్యాచుల్లో చేసి చేసి కొత్త ట్రెండ్ సృష్టించారు. 250 స్కోరు అయితేనే ఓకే అనేలా చేసేశారు. 200 పరుగులకు పైగా మూడు సార్లు చేసి బ్యాటింగ్ అంటే ఇదేరా అనేలా చేశారు. ఇక సన్ రైజర్స్ దే కప్ అనేలా ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కు చేరి ఐపీఎల్ రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లారు.