Team India will play even matches in the World Cup : జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఈసారి టీ20 ప్రపంచ కప్ ఎలాగైనా గెలవాలని టీం ఇండియా భావిస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టు అమెరికాకు వెళ్లనుండగా.. మరో నలుగరుని ఎక్స్‌ట్రా ప్లేయర్లుగా ఎంపిక చేశారు.
ఈ సిరీస్‌లో ఒక్కో గ్రూపులో అయిదు జట్లు ఉన్నాయి. ఇండియా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా, కెనడా టీంలు ఏ గ్రూపులో ఉండగా.. జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో మొదటి మ్యాచ్ అమెరికాలోని నసవు క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత జట్టు ఆడనుంది. జూన్ 9న దాయాదుల పోరుపై అంచనాలు పెరిగిపోయాయి. అమెరికాలోని నసవు ఇంటర్నేషనల్ స్టేడియం అమెరికాలో ఈ హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో కేవలం చాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే పాకిస్థాన్ ఇండియాపై గెలిచింది.
జూన్ 12న అమెరికాతో భారత్ మూడో మ్యాచ్ ఆడనుంది. అమెరికా క్రికెట్ టీం ఇండియా లాంటి గట్టి టీంకు ఎలాంటి పోటీ ఇస్తుందోనని అందరూ వేచి చూస్తున్నారు. అమెరికా టీంలో మొత్తం ఏడుగురు ఇండియా సంతతి క్రికెటర్లు ఉన్నారు. కాబట్టి అమెరికా టీంను తక్కువ అంచనా వేయలేం. అమెరికా టీంకు ఇండియా సంతతి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మోనంక్ పటేల్ కెప్టెన్‌గా సారథ్య బాధ్యతలు తీసుకోనున్నాడు. జూన్ 15న ఇండియా చివరి లీగ్ మ్యాచ్ కెనడాతో ఆడనుంది. ఈ నాలుగింట్లో గెలిస్తే ఇండియా సూపర్ 8కు వెళ్లే అవకాశాలు ఉండగా.. ఈ సారి కప్ కొట్టాలని ఇండియా గట్టిగా అనుకుంటోంది.