Panchayat workers: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 10 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మండల పరిషత్ కార్యాలయం ఎదుట తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 19 నుంచి సమ్మె చేస్తామని ఇన్‌చార్జి ఎంపీడీవో వాజిద్‌కు ఈ గురువారం నోటీసు అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ట్రెజర్‌లో 2024 జూలై నుంచి డిసెంబర్ వరకు బకాయి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలు పరిష్కారనికి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండలం అధ్యక్షులు న్యాత నర్సయ్య, కార్యదర్శి వినీత్, నాయకులు నర్సవ్వ, పూజా నాగేష్, శ్రీను, సురేష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.