Rain Effect: కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో సన్ రైజర్స్ క్వాలిఫయర్ వన్ మ్యాచ్కు చేరుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానానికి పడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్ వన్ మ్యాచ్ అహ్మదాబాద్లో ఆడనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీతో రెండో ఎలిమినేటర్ మ్యాచ్ అహ్మదాబాద్లో ఆడనుండగా.. దీనికి కూడా వర్షం అడ్డంకిగా మారనుంది.
కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ క్వాలిఫయర్ వన్ మ్యాచ్, ఆర్సీబీ, రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్లో జరగనుండగా.. ఈ రెండు మ్యాచులకు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం పడితే క్వాలిఫయర్ మ్యాచుకు రిజర్వ్ డే ఉండగా…. ఒకవేళ అదే రోజు 120 నిమిషాలు ఎక్కువ సమయాన్ని ఐపీఎల్ యాజమాన్యం కేటాయించింది.
ఒక వేళ ఈ రెండు రోజులు కూడా మ్యాచ్లు జరగకపోతే పాయింట్లు పట్టికలో కోల్కతా ఫైనల్కు నేరుగా చేరుకుంటుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ రెండు టీంలు ఎలిమినేటర్ టు మ్యాచ్ ఆడతాయి. ఈసారి రెండు మూడు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ఎలిమినేటరు క్వాలిఫయర్ మ్యాచ్లు జరగకపోతే ఫైనల్ మ్యాచ్కు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈసారి వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో కీలకమైన మ్యాచ్లకు కూడా వర్షం అంతరాయం కలిగించి టోర్నీకి ఇబ్బంది కలిగిస్తోంది.
సన్ రైజర్స్, గుజరాత్ మ్యాచ్ కూడా ఇప్పటికే రద్దయింది. గుజరాత్, కోల్కతా, రాజస్థాన్, కోల్కతా మ్యాచ్లు కూడా రద్దయ్యాయి. ఈ సారి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచులకు వర్షం అడ్డంకిగా మారనుండటం ఆందోళన కలిగిస్తోంది. సన్ రైజర్స్ ఈ సారి టైటిల్ కొట్టి మళ్లీ తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటోంది.