insurance payout: మల్యాల, జూన్ 24 (మన బలగం): మల్యాల మండలంలోని మల్యాల గ్రామంలో వాయుపుత్ర గ్రామ సంఘానికి చెందిన శివసాయి స్వయం సహాయక సంఘం సభ్యురాలు గడ్డం రాజకుమారి మార్చి 25న రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని మంగళవారం అందజేశారు. శ్రీనిధి ద్వారా అందజేయడంతో పాటు రాజకుమారి శ్రీనిధి నుంచి రూ.2 లక్షల రుణం పొంది రూ.1,89,292 రుణం సైతం మాఫీ చేశారు. ఇందుకు సంబంధించిన రెండు చెక్కులను మృతురాలి కుటుంబానికి అందజేశారు. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాలలో చేరడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని చెప్పారు. బీమా సౌకర్యం ఉంటుందని, ప్రతి మహిళా సంఘాలలో చేరాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి చెందడంలో సెర్ప్ సంస్థ ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. అభివృద్ధి చేయడంతో పాటు మరణిస్తే రుణమాఫీ, రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం చిన్న రాజయ్య, సీసీలు, ఉషోదయ మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆమని, కార్యదర్శి నక్క జ్యోతి, గ్రామాల గ్రామ సంఘ అధ్యక్షులు, శ్రీనిధి రామ్ నారాయణ, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ సరిత, ఎంఎస్ఏ సరిత, మల్యాల వివోఏలు, ఎంపీడీవో స్వాతి, సీఐ నీలం రవి, వ్యవసాయ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ముత్యాల లింగారెడ్డి, దొంగ ఆనందరెడ్డి, ముత్యం శంకర్, దార మాదిరెడ్డి, నేరెళ్ల సతీశ్ రెడ్డి, నక్క అనిల్, ప్రకాశ్ రెడ్డి, ఆగాంతం వంశీధర్ పాల్గొన్నారు.