State Second: ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో చొక్కారాంపూర్, మంచిర్యాల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఇందులో 10వ తరగతి విద్యార్థి ఆర్.ప్రత్యూష అండర్ 17 ట్రిపుల్ జంప్‌లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం, ప్రశంసా పత్రం పొందింది. 100 మీటర్ల హార్డిల్స్‌లో పాల్గొని తృతీయ స్థానంలో నిలిచింది. బి.వీణ అండర్ 14 హార్డిల్స్‌లో తృతీయ స్థానం, ఎస్.సారిక అండర్ 14 హై జంప్‌లో తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా వీరికి ప్రబంధకారిణి సభ్యులు, ప్రధానాచార్యులు, ఆచార్యులు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.