maheshwar reddy
maheshwar reddy

Elate Maheshwar Reddy: బీఆర్ఎస్ తొవ్వలో కాంగ్రెస్

  • బీఆర్ఎస్ తొవ్వలో కాంగ్రెస్
  • ప్రజాసంక్షేమాన్ని మర్చిన సర్కార్
  • మంత్రులు చెప్పినా స్పందించని అధికారులు
  • ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమే పోరాటం
  • బీజేఎల్పీనేత మహేశ్వర్ రెడ్డి
maheshwar reddy
Elate Maheshwar Reddy

Elate Maheshwar Reddy: బీఆర్ఎస్ తొవ్వలోనే కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి పాలన కొనసాగిస్తోందని బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూ కుంభ కోణంలో రాష్ట్రంలోనే నిర్మల్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. శ్రీకృష్ణ దేవాలయం, డీమార్ట్, ఢీ1 పట్టాల విషయంలో అనేకమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని అన్నారు. భూ ఆక్రమణలపై మంత్రుల సిఫారసులతో అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదంటే అధికారులకు ప్రభుత్వానికి మధ్య ఏ విధమైన అవగాహన ఉందో అర్థమవుతుందని మండిపడ్డారు. ధరణి పేరుతో రాష్ట్రంలో లక్షల ఎకరాల భూమి మాయమైందని, రికార్డులను సైతం మార్చి దొంగ పట్టాలు పంపిణీ చేశారని ఆరోపించారు.

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఏలేటి

దేశంలో అవినీతిరహిత పాలన అందించిన ఘనత నరేంద్ర మోడీదేనని ఎమ్మేల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి టిఫిన్ బైటక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రామ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *