People’s Co-operative Bank: నిర్మల్, జులై 3 (మన బలగం): ఖాతాదారుల సేవే లక్ష్యంగా తమ బ్యాంకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఓం ప్రకాష్ డియోర పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్గో హింగోలి నిర్మల్ శాఖ మేనేజర్ ఎర్రవార్ స్వామి అన్నారు. గురువారం నిర్మల్ లో బ్యాంకు శాఖను ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఖాతాదారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మిగతా అన్ని బ్యాంకులతో సమానంగా తమ బ్యాంకులో అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా బ్యాంకు రంగంలో సేవలను తమ బ్యాంకు అందిస్తుందని, 1200 కోట్ల టర్నోవర్తో బ్యాంకు రంగంలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రలో తమ బ్యాంకు సేవలను విస్తరించిందని తెలిపారు. విద్య, వ్యాపార, వాహన, గృహ, వ్యక్తిగత అవసరాల కోసం రుణాలను ఇస్తామని తెలిపారు. మిగతా బ్యాంకుల మాదిరిగానే తమ బ్యాంకులో వడ్డీ ఉంటుందని మేనేజర్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వ్యాపారులు, ఖాతాదారులు, అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ దేవుడా, సిబ్బంది యువరాజ్ రాథోడ్, సతీష్ ఎర్రవార్, సత్యనారాయణ పెడ్కోడ్ వార్ లు పాల్గొన్నారు.