Implementation of Old Pension Scheme demanded by STU Nirmal: విద్యారంగ సమస్యలు మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అన్నివేళలా కృషి చేస్తుందని, ఉద్యోగ ఉపాధ్యాయులకు సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎస్టీయూ టీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్.భూమన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పలు పాఠశాలలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 317 జీ.వో. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పెన్షనర్స్ బిల్లులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన ప్రాథమిక పాఠశాలలలో సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వము విద్యా వలంటీర్లను నియమించాలని, తద్వారా గుణాత్మక విద్యాసాకారం అవుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.