Midday Meal Quality: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపెల్లి ప్రభుత్వ జడ్పీ పాఠశాలను జిల్లా సీపీవో జీవరత్నం, ఎంపీడీవో చిక్యాల రత్నాకర్ రావ్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం, వంటలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించాలని, అందరు కలిసి భోజనం చేయాలని చెప్పారు. అలాగే గ్రామంలో పారిశుధ్య పనులు పరిశీలించారు. చెత్తను ఇష్టం వచ్చినట్లు పడేయవద్దని చెప్పారు. గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దనీ, గ్రామంలో చెత్త, చెదారం వెంటనే తీసివేయాలని చెప్పారు. ప్రజలకు పారిశుధ్యంపై అవగాహ కల్పించారు.
