AI-based ECG Analysis for Early Heart Attack Detection – Dr. Mohan Babu from Garjanapalli
AI-based ECG Analysis for Early Heart Attack Detection – Dr. Mohan Babu from Garjanapalli

AI-based ECG Analysis for Early Heart Attack Detection – Dr. Mohan Babu from Garjanapalli: గుండెపోటు ముందే గుర్తించొచ్చు.. గర్జనపల్లి వాసి అరుదైన ఘనత..

AI-based ECG Analysis for Early Heart Attack Detection – Dr. Mohan Babu from Garjanapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన మోహన్‌బాబు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పూర్తి చేశారు. మారుమూల పల్లె నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ డాక్టరేట్ స్థాయి చేరుకున్నారు. దీంతో తండవాసులు, గ్రామస్తులు, మండల వాసులు మరియు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బి.మోహన్‌బాబు ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పూర్తి చేశారు. ఆయన పరిశోధన ‘టెంపోరల్ అండ్ స్పేషియల్ అనాలిసిస్ ఆఫ్ ఈసిజి ఫర్ అరిథ్మియా డిటెక్షన్ యూజింగ్ డీప్ లెర్నింగ్’ అనే శీర్షికతో, ప్రొఫెసర్ బి.సంధ్య, ప్రొఫెసర్, ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, హైదరాబాద్ మార్గదర్శకత్వంలో జరిగింది.

మోహన్‌బాబు పరిశోధనలో గుండె స్పందనలో కలిగే అరిథ్మియాలను (అసాధారణ గుండె స్పందనలు) గుర్తించడానికి అధునాతన డీప్ లెర్నింగ్ నమూనాలను అభివృద్ధి చేశారు. అరిథ్మియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆకస్మిక గుండెపోటు మరియు ఇతర హృద్రోగ సమస్యలకు గురవుతున్నారు. దీన్ని ముందుగానే గుర్తించడం ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ మరియు వైద్య నిపుణులు లభించని ప్రాంతాలలో ఇది మరింత అవసరం.

ఆయన అభివృద్ధి చేసిన కంప్యూటర్ మోడల్స్ స్వయంచాలకంగా ఈసీజీ డేటాను విశ్లేషించి, గుండె స్పందనలోని లోపాలను ఖచ్చితంగా గుర్తించగలవు. ఈ సాంకేతికత వైద్యులకు సహాయపడటంతో పాటు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సాధ్యం చేస్తుంది. తక్కువ ఖర్చుతో, ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణకు మార్గం సుగమం చేస్తుంది. మోహన్‌బాబు పరిశోధన ఫలితాలు జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి. వివిధ సదస్సుల్లో పత్రాలను సమర్పించారు. ఆయన కృషి ఆధునిక కంప్యూటర్ సైన్స్ పరిశోధనను వైద్యరంగం అవసరాలకు అనుసంధానం చేస్తుంది. ఈ సాధన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టను పెంచడమే కాక, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ సమాజానికి చేరువ కావడంలో ఒక ముందడుగు అవుతుంది. పీహెచ్డీ సాధించిన గర్జనపల్లి గిరిజన బిడ్డను మండల గ్రామ ప్రజాప్రతినిధులు శ్రేయోభిలాషులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *