Scholars provide clarity on Sunday's eclipse
Scholars provide clarity on Sunday's eclipse

Scholars provide clarity on Sunday’s eclipse: ఆదివారం గ్రహణంపై క్లారిటీ ఇచ్చిన పండితులు 

Scholars provide clarity on Sunday’s eclipse: ఈనెల 21న అమావాస్య రోజున మన దేశంలో ఎలాంటి గ్రహణం లేదని, వట్టి పుకార్లను నమ్మవద్దని నిర్మల్ వైధిక బ్రాహ్మణ సేవా మండలి ఒక ప్రకటణలో తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ వైధిక బ్రాహ్మణోత్తములైన ఓరుగంటి గుణవంత్ రావు, ఇందూర్తి ఆచార్య కళ్యాణ్ మాట్లాడుతూ ఈ అమవాస్య రోజున మనకు ఎలాంటి గ్రహణాలు లేవన్నారు. అనవసరంగా పలు యూట్యూబ్ చానళ్లు ప్రజలను గ్రహణాల పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే ఫాల్గుణ మాసం అనగా మార్చి 3న చంద్ర గ్రహణం ఉంటుందని, అంతే కానీ మరెప్పుడూ ఈ సంవత్సరం ఏ గ్రహణాలు లేవని స్పష్టం చేశారు. గర్భిణులు స్త్రీలు ఎలాంటి అపోహలు పెట్టుకోరాదని సూచించారు.

అలాగే ఆచార్య కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ నెల 22 న సోమవారం నుంచి ఆశ్వీయుజ మాసం ప్రారంభమౌతుందని దానితో 22, సోమవారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆచార్య కళ్యాణ్ తెలిపారు. అయితే ఈ నవరాత్రులలో ప్రతి సంవత్సరం వలె కాకుండా ఈ సంవత్సరం 11 రోజులు ఉంటాయని తెలియజేశారు. ఈ నెల 29, సోమవారం మూల నక్షత్రం సరస్వతీ అమ్మవారి జన్మనక్షత్రం, 30 మంగళవారంన దుర్గాష్టమి, అలాగే వచ్చే నెల అక్టోబర్ 1, బుధవారం మహర్నవమి, 2 గురువారం విజయదశమి, దసర పండుగ అని ప్రజలు ఇవి గమనించి పండుగలు జరుపుకోవాలని ఆచార్య కళ్యాణ్ వివరించారు. కార్యక్రమంలో నిర్మల్ బ్రాహ్మణోత్తములైన సిర్గ రాఘవేందర్, పట్వారి గోపాలకృష్ణ, గాడిచర్ల గౌతమ్ శాస్త్రి, గాడిచర్ల చంద్రశేఖర్ శాస్త్రి, నాలం వెంకటరమణ జ్యోషి, నాలం పవన్ జ్యోషి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *