పట్టాల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Tension at Khanapur Tahsildar office over double bedroom housing pattas: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తాలో ప్రభుత్వం పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి లబ్ధిదారులను ఎంపిక చేసి ఇచ్చారు. కానీ ఇంత వరకు వారికి ఇంటి పట్టాలు ఇవ్వకపోవడంతో గురువారం ఆందోళనకు దిగారు. న్యూడెమోక్రసీ నాయకులు నంది రామయ్య మాట్లాడుతూ, పేదలకు ఇండ్ల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తే అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో స్థలం కేటాయించారని, బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి 400 మంది పేదలకు ఇండ్లు కేటాయించారని తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి సరైన సౌకర్యాలు లేకున్న పేదలు అక్కడే నివాసం ఉంటున్నారని అన్నారు. నివాసాలకు బ్లాక్ నెంబర్లు, ఇంటి నెంబర్లు మాత్రమే కేటాయించారని, కేటాయించిన ఇండ్లకు మాత్రం పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
దీనితో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. అయితే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్హులైన పేదలందరికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బాణావత్ గోవింద్, గీసా లక్ష్మి, ముత్తన్న, షేఖ్ హైదర్, నశ్రత్, పద్మా, బాలసంకుల ప్రభాకర్ రావ్, షేఖ్ షమి, గట్టు శ్రీనివాస్, జెట్టి గంగన్న, చంద్రయ్య, వర్మ, వెంకటేశ్, ఇందూర్, చొప్పదండి శంకర్, దేవిదాస్, షేఖ్ మియాఖాన్, ధర్మపురి శ్రీదేవి, బీమక్కా, గంగు, పద్మావతి, స్వాతి, రాధ, భారతి, వాణి, జల, రజిత, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

