101 Types of Naivedyam Offered to Goddess Durga at Shivajinagar: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శివాజినగర్ కాలనీలో శనివారం రాత్రి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి 101 రకాల ప్రసాదాలు నైవేద్యం భక్తులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అభిషేకం, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మహిళలు అమ్మవారి ఒడిబియ్యం పోసి మొక్కలు చెల్లించికున్నారు. భజనలు, అమ్మవారి కీర్తనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా నిర్వాహకులు తాగిన ఏర్పాట్లు చేశారు.