Fight Against Caste System Inspired by Mahatma Jyotirao Phule – CPI ML Mass Line
Fight Against Caste System Inspired by Mahatma Jyotirao Phule – CPI ML Mass Line

Fight Against Caste System Inspired by Mahatma Jyotirao Phule – CPI ML Mass Line: మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో కుల నిర్మూలనకై పోరాడుదాం

సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య

Fight Against Caste System Inspired by Mahatma Jyotirao Phule – CPI ML Mass Line: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అడవి సారంగాపూర్, జిల్లెడికుంట గ్రామాల్లో ఆదివారం సీఐపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సదస్సులు నిర్వహించారు. పార్టీ నాయకులు మడావి అంకుష్ రావు, ఆత్రం భీమ్రావులు అధ్యక్షతన ఈ నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య మాట్లాడుతూ, జ్యోతిరావు ఫూలే సత్యశోధకు సమాజ్ స్థాపించి 152 సంవత్సరాలు అయినందని, ఆయన స్ఫూర్తితో కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని, ఏ దేశంలో లేని కుల వ్యవస్థ భారతదేశంలో అత్యంత దుర్మార్గంగా కొనసాగుతుందని, కూకటి వేళ్ళతో కుల వ్యవస్థను పెకిలించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు జక్కుల రాజన్న, లింగు, భీమ్రావు, చందు, మోహన్ సుందర్, గంగారాం, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *