Sri Ramnagar Dasara Celebrations 2025: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పురాతన ప్రాంతం అయిన శ్రీరాంనగర్‌లో దసరా పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. జండాగల్లీలో విజయపతాక జెండా ఎగుర వేశారు. జెండా కర్రకు కాషాయం రంగు వేసి, తెల్లటి పతాకం కట్టి పూజలు చేశారు. అలాగే మైసమ్మ గుడి వద్ద ఆనవాయితీగా అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఉత్తర వాహినిగా ప్రవహించే గోదావరి నది వద్ద జమ్మి చెట్టుకు పూజ ఘనంగా పూజలు నిర్వహించారు. జమ్మి ఆకులు (బంగారం) ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్‌చార్జి బుక్య జాన్సన్ నాయక్ పాల్గొని పూజలు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో వీడీసీ పెద్దలో సతీశ్ రావ్ డెస్పాందే, సంతోష్ రావ్ దాస్పండే, లాండేరి కిషన్, మైలారపు గంగాధర్, ఆత్మ చైర్మన్ తోట సత్యం, మాలేపు రాజశేఖర్, కుమ్మరి ఇస్తారు, తొంటుకూరి నాగరాజు, పంబాల భీమన్న, డబ్బా శ్రీనివాస్, జన్నారపు శంకర్, నాయిని సంతోష్, గడుదాస్ రవి చరణ్, ఎలిశెట్టి లింగేశ్, చంద్రహస్, పసుపుల చిట్టీ, కట్టెకోల నర్సయ్య, కరిపే రంజిత్, గుమ్ముల రాజేందర్, స్థానికులు పాల్గొన్నారు.