- తాళ్లతో చెట్టుకు బంధించిన భర్త
American lady: మహారాష్ర్టలో అమానవీయ సంఘటన చోటు చేసుకున్నది. కట్టు్కున్న భార్యను భర్త అడవిలో చెట్టుకు కట్టేయగా, 40 రోజులు జీవచ్ఛంలా గడిపిన ఆమె చివరకు ప్రాణాలతో బయటపడింది. ముంబైకి 540 కిలో మీటర్ల దూరంలోని సింధుదుర్గ్ జిల్లాలోని అడవిలో ఆమెను బంధించగా, గొర్రెల కాపరి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికన్ మహిళ లలితా కాయిని(50) వద్ద తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు, అమెరికన్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు హుటాహుటిన బాధితురాలిని దవాఖానకు తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. 40 రోజులుగా ఆహారం, నీరు లేకపోవడంతో పూర్తిగా బక్కచిక్కిపోయి మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిపోయింది. దవాఖానలో బెడ్‌పై ఉన్న ఆమె జరిగిన ఉదంతాన్ని పేపర్‌పై రాసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్తే తనను తాళ్లతో చెట్టుకు బంధించాడని పేర్కొంది. తనను తాళ్లతో కట్టివేయానికి ముందు ఇంజక్షన్ చేసినట్లు వెల్లడించింది.