EVM warehouse: నిర్మల్, డిసెంబర్ 10 (మన బలగం): కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను మంగళవారం కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈవీఎం గోదాం వద్ద భద్రత సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. షిఫ్టుల వారీగా భద్రతను పర్యవేక్షించాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి డి.శివాజీ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రావణ్ రెడ్డి, గండ్రత్ రమేశ్, సిరికొండ రమేశ్, గాజుల రవి, నరేశ్, మజార్, భద్రతా సిబ్బంది, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.