- బిల్లులు రాక పెట్రోల్ పోసుకొన్న మాజీ సర్పంచ్ నాగరాజు
- అడ్డుకొని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
Former sarpanch suicide attempted: ఇబ్రహీంపట్నం, జనవరి 24 (మన బలగం): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో మాజీ సర్పంచ్ వనతలుపుల నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ కె.రాజు మాజీ సర్పంచ్ నాగరాజును అదుపులోకి తీసుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనకు రావాల్సిన దాదాపు రూ.20 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నాగరాజు తెలిపారు. బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే పథకాలను అమలు చేసే విధంగా ఈ గ్రామసభను నిర్వహించారని, అందుకే గ్రామసభను బహిష్కరిస్తూ పెట్రోల్ పోసుకున్నానని నాగరాజు తెలిపారు.