Former Minister Koppula Ishwar: పెద్దపల్లి, జనవరి 24 (మన బలగం): పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దివంగత బిరుదు రాజమల్లు మొదటి వర్ధంతిని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాజమల్లు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
