Whip Adi Srinivas: ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 13 (మన బలగం): రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలోని ముదిరాజ్ సంఘ భవనంలో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజుల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఐకమత్యంగా ఉండి సంఘభవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం తీసుకురావడానికి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామన్నారు. కులగణన సర్వేలో పాల్గొనని వారు ఈనెల 16 నుంచి 28 వరకు నిర్వహించే రీ సర్వేలో వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సాబేర బేగం, వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు చొప్పరి రామచంద్రం, జిల్లా ముదిరాజు సంఘం అధ్యక్షుడు రాము, జిల్లా బీసీ సెల్ డైరెక్టర్ వెంకటస్వామి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు డాక్టర్ దేవేందర్, పిట్టల భూమేష్, రాజకుమార్, రమేష్, పిట్ల రాంగోపాల్ రావు, శ్రీనివాసరావు, బాబు, సత్తయ్య, దండు శ్రీనివాస్, రాజయ్య, రవి, సాయికుమార్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.