Grant of Integrated Residential School to Dharmapuri
Grant of Integrated Residential School to Dharmapuri

Grant of Integrated Residential School to Dharmapuri: ధర్మపురికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన విప్ లక్ష్మణ్ కుమార్
Grant of Integrated Residential School to Dharmapuri: ధర్మపురి, నవంబర్ 23 (మన బలగం): ధర్మపురి నియోజకవర్గానికి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల (సమీకృత గురుకుల పాఠశాల), కేంద్రీయ విద్యాలయం, (నవోదయ పాఠశాల) పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కోసం కొన్ని నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిస్తున్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం రెండో విడత నియోజకవర్గాలకు మంజూరు చేసిన సమీకృత గురుకుల యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాల (ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్)ను ప్రభుత్వం ధర్మపురి నియోజకవర్గానికి మంజూరు చేసింది. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ధర్మపురి పట్టణ శివారులో ప్రభుత్వ యంత్రాంగం స్థలాన్ని సేకరించి సమీకృత ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు కేటాయించడానికి సిద్ధం చేశారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు ఉత్తర్వులు జారుచేశారు.

Grant of Integrated Residential School to Dharmapuri
Grant of Integrated Residential School to Dharmapuri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *