Godavari Maha Harathi at Dharmapuri on 30th: ధర్మపురి, నవంబర్ 23 (మన బలగం): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈ నెల 30న గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్టు రాష్ట్ర కో కన్వీనర్ దామోర రామ్, సుధాకర్ రావు తెలిపారు. గోదావరి మహా హారతి కార్యక్రమంలో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముందు శనివారం గోదావరి మహా హారతి పోస్టర్లను ఆవిష్కరించారు. 13 సంవత్సరాలగా గోదావరి మహా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామ్ సుధాకర్ తెలిపారు. ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దామోర రామ్, సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల 30న సాయంత్రం ధర్మపురిలో జరగనున్న గోదావరి మహా హారతి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైదిక స్మార్త జ్యోతిష పౌరాణికులు బ్రహ్మశ్రీ పాలెపు భరత్ శర్మ జిల్లా కన్వీనర్ పిల్లి శ్రీనివాస్, సంగీ నరసయ్య, కస్తూరి రాజన్న, బెజ్జారపు లవణ్, బండారి లక్ష్మణ్, దొనకొండ నరేశ్, నల్లమాసు వైకుంఠం, గాజు భాస్కర్, తిరుమందాస్ సత్యనారాయణ, అప్పం మల్లేశ్, దివిటి శ్రీధర్ , పల్లేర సురేందర్ కాశిట్టి హరీశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.