Terrace Gardening
Terrace Gardening

Terrace Gardening: మిద్దె తోటల సాగు భేష్

సందర్శించిన సిక్కిం రాష్ట్ర హార్టికల్చర్ అధికారులు

Terrace Gardening: సిక్కిం రాష్ట్ర హార్టికల్చర్ అడిషనల్ డైరెక్టర్ బిజు పెరియార్ హైదరాబాద్‌లోని అర్బన్ ఫార్మింగ్ విభాగం, రెడ్ హిల్స్, పబ్లిక్ గార్డెన్ హెర్బల్ యూనిట్లను గురువారం సందర్శించారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆర్టికల్చర్ ప్రేమ్ సింగ్, డిప్యూటీ డైరెక్టర్ టెక్నికల్ బి.విజయ ప్రసాద్, హార్టికల్చర్ ఆఫీసర్ బి.మంగ ఉన్నారు.
బిజు పెరియార్ తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న మిద్దె తోటల పెంపకం, అర్బన్ ఫార్మింగ్ కార్యాచరణ ప్రణాళికను తెలుసుకున్నారు. కూరగాయలు, పండ్లు, పూల సాగు, అర్బన్ గార్డెన్ అభివృద్ధి చేయడానికి తగిన సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూపు వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చంద్రావతి మిద్దె తోటను సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానవన శాఖ వారు ‘మన ఇల్లు- మన కూరగాయలు’ అనే పథకం పేరుతో హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో కూరగాయలను మిద్దె, ఇంటి ఆవరణలో పెంచేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

ప్రతి మనిషికి రోజుకు సగటున 400 గ్రాముల కూరగాయలు, పండ్లు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అవసరమయ్యే కూరగాయలను మిద్దె ఇంటి ఆవరణలో కొంతవరకు సాగు చేయడం వలన కరోనా లాంటి మహమ్మారి వ్యాపించిన పరిస్థితులను ప్రజలు అధిగమించారు. రసాయన మరియు పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యమైన, తాజా పోషక విలువలు కలిగిన కూరగాయలు, పండ్లను సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నారు. ఇంటిల్లిపాదికి కావలసిన కూరగాయలను సంవత్సరం పొడవునా వారి అభిరుచికి అనుగుణంగా ఇతర కూరగాయలను పెంచుకోవచ్చు. దీనితోపాటు కుటుంబ సభ్యులందరికీ మానసిక ఉల్లాసం, శారీరక వ్యాయామం లాంటి లాభాలు చేకూరుతాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన సంచాలకులు షేక్ ఆస్మిన్ బాషా మిద్దెతోటల పెంపకానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించడంతోపాటు మిద్దె తోటల పెంపకం నాకు అవసరమైన ప్రోసాహాన్ని అందిస్తున్నారు.

మిద్దె తోటల ఆవశ్యకతను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్యానవన శాఖ వారు విశిష్టమైన కృషి చేస్తున్నారు. మిద్దె తోటల పెంపకం(Terrace Gardening)లో మెళకువలు, యాజమాన్యం లాంటి అనేక సాంకేతిక విషయాలపైన ఉద్యానవన శాఖ తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతినెలా రెండో శనివారం, నాలుగో ఆదివారం పది సంవత్సరాల నుంచి తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ రెడ్ హిల్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఉద్యానవన శాఖ వారు రైతు నేస్తం సిటిజి (సిటీ టెర్రస్ గార్డెన్) గ్రూప్ మరియు ఎన్జీవోస్ (నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్) వారి సహకారంతో దాదాపు 52 వేల మంది పైచిలుకు మిద్దె తోటల పెంపకందారులకు శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా దాదాపు 25 వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతరం వారు అడిగిన సమస్యలకు సమాధానాలు ఇస్తున్నారు. ఎగ్జిబిషన్ స్టాల్స్, నర్సరీ మేళా లాంటి కార్యక్రమాల్లో పాల్గొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వరంగల్, వనపర్తి, సూర్యాపేట, కరీంనగర్ లాంటి జిల్లాల్లో మిద్దె తోటల పెంపకం విస్తరించింది.

ప్రస్తుతం మిద్దె తోటల సాగుదారులలో మహిళలు 61 శాతం సాగు చేయగా, 29 శాతం యువత ఉన్నారు. పది సంవత్సరాల నుంచి మిద్దె తోటలను పెంచడమే కాకుండా ఇతరులకు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ అనుభవాలను ప్రచారం చేస్తున్నారు. ఇవే కాకుండా సారవంతమైన మట్టి మిశ్రమం వాడడంలో వంటింటి వ్యర్థాలతో కంపోస్టు మరియు వర్మి కంపోస్ట్ తయారు చేసుకుని వినియోగించడంలో చీడపీడలను సేంద్రియ పద్ధతులలో నియంత్రించుకోవడం వంటి విషయాలలో తమ నైపుణ్యం కనబరుస్తున్నారు. ఇంకా సాగు రంగంలో వివిధ నూతన రకాలైన పద్ధతులను వెజిటేబుల్ గ్రాఫ్టింగ్ మొక్కలు వంగ టమాట మిరప అదే విధంగా తీగజాతి కూరగాయలైన కాకర, సోరా వంటి వాటిని పెంచుతున్నారు. షేడ్ నెట్‌లలో మొక్కలను పెంచడం, ఎక్సోటిక్ వెరైటీస్ అయిన కూరగాయలను, పండ్లను పెంచడంలో తమ ప్రతిభను చాటతున్నారు.

ఇటీవల కాలంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రీన్ ప్రాపర్టీ షోను హైటెక్ సిటీలోని ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించారు. దీనిలో గ్రీన్ బిల్డింగ్ పద్ధతులు మరియు పర్యావరణం కాపాడే పరిస్థితుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అర్బన్‌హీట్ ఐలాండ్ ప్రభావం, వర్షపునీరు సేకరణ, నిల్వ పద్ధతులపై అవగాహన కల్పించారు. మిద్దెతోటలలో కుటుంబ సభ్యులకు కావాల్సిన పాలకూర, మెంతికూర, చుక్కకూర, తోటకూర, బచ్చలి, గోంగూర, పొన్నగంటి, కొత్తిమీర, పుదీనా, చుక్కకూర, కరివేపాకు, మునగ, ఎర్రతోట కూర, గంగబాయలు తదితర ఆకుకూరలను అధిక శాతంలో సాగు చేస్తున్నారు. వంకాయ, బెండ, టమాట, గోరుచిక్కుడు, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాప్సికం, మిరప లాంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. తీగజాతి కూరగాయలు బీర, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయను పండిస్తున్నారు. ఇంట్లో పూజకు, మానసిక ఉల్లాసం పెంపొందించే పూల మొక్కలు గులాబీ, మల్లె, మందార, లిల్లీ, శంకుపుష్పి, తామర, కలువ, ఆర్కిడ్స్, సీతమ్మ జడ, దాలియా, అజైలియా వంటి వాటిని సాగు చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఇది గృహాలంకరణ మరియు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న గాలిని శుద్ధి చేయడం కోసం ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్‌ను పెంచుతున్నారు. దీనిలో భాగంగా స్నేక్ ప్లాంట్స్ మాన్స్టర్, చైనీస్ మనీ వాటిని, అదేవిధంగా అవుట్‌డోర్ మొక్కలు అరికా పాము, మనీ ప్లాంట్, డ్రెస్సీనా, ఆస్పరస్ వంటి వాటిని పెంచుతున్నారు. చాలా తక్కువ శాతంలో పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ఎందుకు అంటే పూత మరియు కాత దశ చేరుకోవడానికి ఎక్కువ శాతం తీసుకోవడం వలన అత్తి, బొప్పాయి, స్ట్రాబెరీ, జామ, మామిడి, ఆపిల్ బేర్, దానిమ్మ, నిమ్మ, నారింజ, మల్బరీ, సీతాఫలం అవే కాకుండా యాంటీ క్యాన్సర్స్ ఫ్రూట్స్ అయినా నోని, లక్ష్మణ్ ఫలము మిద్దెతోటలపైన చాలా విజయవంతంగా సాగు చేస్తున్నారు. ఔషధ మొక్కలు అనగా కలబంద, కామాక్షి, బ్రహ్మీ, తిప్పతీగ, తులసి, నల్ల పసుపు, నల్లేరు, వావిలి, అదేవిధంగా లెమన్ గ్రాస్ యురేనియం, కామారోజా, లావెండర్, మరువం లాంటి మొక్కలను వారి అభివృద్ధికి తగ్గట్లు సాగు చేస్తున్నారు. సుగంధద్రవ్య పంటలు అయిన అల్లం, వెల్లుల్లి, ఉల్లి, ఆవాలు, పసుపు లాంటి వాటిని పెంచుతున్నారు. సుగంధ మొక్కలు అనగా మంచి సువాసన ఇచ్చి ఇంట్లో దోమలను కూడా తరిమి కొట్టడం జరుగుతుంది. వీటిలో లెమన్ గ్రాస్, పామరోసా, దవనం, మరువము వంటి వాటిని పెంచుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *