Jagityal Collector: ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 3 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ బి.సత్య ప్రసాద్ హెల్త్ సెంటర్ నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన రూ.20 లక్షలతో నిర్మిస్తున్న పనులను పరిశీలించిన పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మెట్‌పల్లి ఆర్‌డిఓ శ్రీనివాస్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో సాంబరి చంద్రశేఖర్, పీఆర్ ఈఈ అబ్దుల్ రహమాన్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.