- గ్రామ సభకు హాజరుకానున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
- ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Arrival of Ministers: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 22 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం కొనసాగుతున్న అర్హుల గుర్తింపు గ్రామ సభలకు మంత్రివర్యులు జిల్లాకు విచ్చేయనున్నారు. బుధవారం జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించనున్న గ్రామసభ అలాగే బహిరంగ సభ ఇతర కార్యక్రమాలకు భారీ నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో హెలిప్యాడ్ అలాగే బహిరంగ సభ ప్రాంగణం కలి కోట సూరమ్మ ప్రాజెక్టు వద్ద పనులు, ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.