Jacqueline Fernandez
Jacqueline Fernandez

Actress: ఈ చిన్నారి ఎవరో గుర్తుందా? ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసిన హాట్ బ్యూటీ

Actress: ప్రముఖ హీరోలు, హీరోయిన్లు వివిధ సందర్భాల్లో వారి చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. అలా వారు షేర్ చేసిన ఫొటోలు అప్పుడప్పుడు తెగ వైరల్ అవుతుంటాయి. ఆగస్టు 11న ప్రముఖ హీరోయిన్ తన పుట్టిన రోజు సందర్భంగా షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ అమ్ముడుది మన కంట్రీ కాదు. పొరుగునే ఉన్న శ్రీలంక. అయినా వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే తరచూ వివిదాలతో వార్తల్లోకి ఎక్కుతుంది. ప్రభాస్ నటించిన సాహో సినిమాలో బ్యాడ్ బాయ్స్ అంటూ కుర్రకారును హుషారెత్తించింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్.

జాక్వెలిన్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. జాక్వెలిన్ బహ్రెయిన్‌లో జన్మించినా పుట్టి పెరిగింది శ్రీలంకలో. 2009లో విడుదలైన అల్లాదీన్ మూవీతో ఫిల్మ్ ఇండస్ర్టీలోకి అడుగు పెట్టింది. అనంతరం పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే రూ.200 కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణలో భాగంగా పలు మార్లు ఈడీ విచారణను ఎదుర్కొంది. ప్రస్తుతం జాక్వెలిన్ వయసు 39 సంవత్సరాలు. అయితే జాక్వెలిన్ మాత్రం పెళ్లి గురించి ఇప్పటికీ దాటవేస్తూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *